![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -93 లో...శౌర్య ప్రతిసారి కార్తీక్ కార్తీక్ అంటుంటే.. దీపకి ఏం చెప్పాలో అర్థం కాదు. దీప బయటకు వచ్చి శౌర్యకి ఏమని చెప్పాలి ? ఎలా చెప్పగలనంటూ బాధపడుతుంటే అప్పుడే ఇంటిముందు నుండి ఒకతను వెళ్తుంటాడు. దీపని చూసి ఫిగర్ బాగుంది.. ఎలాగైనా నాదాన్ని చేసుకోవాలని అనుకుంటాడు. దీప అతన్ని కోపంగా చూసి లోపలికి వెళ్లిపోతుంది. మరొకవైపు సుమిత్ర దశరత్ లు పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్తారు. అక్కడ దీప గురించి మాట్లాడుతూ.. సుమిత్ర ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత కార్తీక్ , జ్యోత్స్నల ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడుకుంటారు. మాకు ఒకే మీరు ముహూర్తం పెట్టించండని కాంచనా చెప్పగానే ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం లు దీపని వెతకడానికి వెళ్తారు. కార్తీక్ కార్ కన్పించగానే జ్యోత్స్న ఆగి.. చూసావా బావ ఎలా దీప కోసం వెతుకుతున్నాడో అని పారిజాతంతో అంటుంది. కార్తీక్ ని జ్యోత్స్న ఫాలో అవుతుంటే.. అతను చూసి కార్ ఆపి, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారని అడుగుతాడు. నువ్వు దీప కోసం వెతుకుతున్నావ్ కదా అందుకే అని జ్యోత్స్న అంటుంది. మీరు ఒకవైపు వెతకండి అంతే గానీ నా దారిలో ఎందుకు రావడం.. మన ఇద్దరి దారులు ఎప్పటికి ఒకటి కావని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. చూసావా గ్రానీ ఎలా డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నాడో అని జ్యోత్స్న అంటుంది.ఆ తర్వాత దీప షాప్ కి వెళ్తుంది. అక్కడే దీప ని సొంతం చేసుకోవాలని అనుకున్న అతను ఉంటాడు. సరుకులు ఇవ్వండి అని దీప అనగానే.. నా మనిషిగా ఉంటే నువ్వేం పని చేయనవసరం లేదు.. నేను చూసుకుంటా అని అతను అనగానే.. అతని చెంపపై ఒక్కటిస్తుంది దీప. అబ్బో ఇది అందరిలాంటి ఆడది కాదని అతను భయపడుతాడు.
ఆ తర్వాత సుమిత్ర , దశరత్ లు కార్తీక్ జ్యోత్స్నల పెళ్ళి ముహూర్తం గురించి కాంచనతో మాట్లాడితే ఒకే అందని ఇంటికి వచ్చి చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ టైమ్ లో దీప కూడా ఉండి ఉంటే బాగుండేది అని పారిజాతం, జ్యోత్స్న లు అంటారు. మరొకవైపు దీప కోసం కార్తిక్ వెతుకుతుంటే దీప కన్పిస్తుంది. దగ్గరికి వెళ్లి అర్ధం అయ్యేలా చెప్పాలని ట్రై చేస్తుంటే దీప వినదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |